ఢిల్లీ:  కేంద్రం కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో ఆర్థిక సంక్షోభం అంటూ, మరో శ్రీలంక కాబోతుందంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. అదే సమయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం, ప్రతిపక్ష టీడీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. న్యూఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

  • ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక ఇండెక్సెస్‌ అన్నీ కూడా లిమిట్స్‌లోనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉందని తెలియజెప్పేందుకు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం.
  • 19 జులై 2022న నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కేంద్రం ఏర్పాటు చేసింది. ఎంపీలందరికీ కూడా దేశ ఆర్థిక పరిస్థితిని ఈ సమావేశంలో వివరిస్తూ..శ్రీలంకకు ఏ రకంగా మనం సహాయం చేయాలని చెప్పారు.
  • ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కూడా వివరించారు.  ఈ సమావేశంలో కొన్ని వివరాలు ఇచ్చారు.
  • గత కొన్ని రోజులుగా చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది..మరో శ్రీలంకగా మారబోతుందని పదే పదే చెబుతున్నారు. ఆ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఎక్కడా కూడా వివరించలేదు. రాష్ట్ర, కేంద్ర పాలితప్రాంతాల ఆర్థిక పరిస్థితిని వివరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.