రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. రాష్ట్రపతిని కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ డిమాండ్‌ చేశారు.

అనంతరం.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అధినేత్రి  విరుచుకుప‌డ్డారు. త‌న‌తో మాట్లాడ‌వ‌ద్ద‌ని మండిప‌డ్డారు. మ‌ద్యాహ్నం 12 గంట‌ల‌కు లోక్‌స‌భ వాయిదా ప‌డిన స‌మ‌యంలో బీజేపీ నేత ర‌మాదేవితో సోనియా మాట్లాడుతుండ‌గా వారి సంభాష‌ణ‌లో స్మృతి ఇరానీ క‌ల్పించుకున్నారు. ఆపై ఆగ్ర‌హంతో ఊగిపోయిన సోనియా.. స్మృతి ఇరానీ వైపు తిరిగి త‌న‌తో మాట్లాడ‌వ‌ద్ద‌ని అన్న‌ట్టు స‌మాచారం. ఇక అదీర్ వ్యాఖ్య‌ల‌పై అంత‌కుముందు  స్మృతి ఇరానీ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు.

అంతకుముందు, ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. దీంతో, లోక్‌సభకు సాయంత్రం 4 గంటల వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు.. అధిర్‌ రంజన్‌ చౌదరి.. రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ  అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలో సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ స్మృతి ఇరానీ ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళను అవమానించడాన్ని సోనియా గాంధీ ఆమోదించారని మండిపడ్డారు. సోనియా గాంధీ.. ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, స్త్రీ వ్యతిరేకి అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.