‘నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినందునే నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోతున్నా. కనీసం సంక్షేమ పథకాల పంపిణీలో కూడా నా ప్రమోయం లేకుండా చేస్తున్నారు. నియోజకవర్గంలోని చర్లగూడెం, కిష్టరాయినిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తే నాకు గుర్తింపు వస్తుందని ఆ పనులకు నిధులు ఇవ్వడం లేదు. ఇక కాంగ్రెస్‌ పార్టీని బలోపేతానికి కృషి చేస్తే అక్కడ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎలాంటి పదవులు ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు.. నేను రాజీనామా చేస్తే కొన్నైనా అభివృద్ధి పనులను చేపడతారు.. అందుకు నిదర్శనం గట్టుప్పల మండల ఏర్పాటే. అందుకే పార్టీ మారడం అనివార్యం.. పార్టీ మారితే నాతో మీరొస్తారా..? వస్తే ఇంతకంటే బాగానే ఉంటుంది.’
ఇవీ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో చెబుతున్న మాటలు. దీనినిబట్టి ఆయన పార్టీ మారడం ఖాయమైపోయిందని అర్థం అవుతోంది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరే అంశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం ధ్రువీకరించారు

By admin

Leave a Reply

Your email address will not be published.