గొల్లప్రోలు: అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అనే నానుడి ఉందని, కానీ, అడగకపోయినా అక్కచెల్లెమ్మలకు అన్నీ ఇచ్చే మంచి మనసున్న సోదరుడు జగనన్న మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వంగా గీత అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా, అన్ని వయసుల వారికి ఏ సహాయం కావాలో తెలుసుకొని.. లంచం, సిఫారసు లేకుండా అందరికీ ఆర్థిక సహకారం అందిస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని చెప్పారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం మూడో ఏడాది అమలు కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా పాల్గొని మాట్లాడారు.

‘‘ఎవరు మంచి కార్యక్రమాలు చేస్తారో అందరూ వారినే అనుసరిస్తారు అని భగవద్గీతలో పద్యం ఉంది. ఆ విధంగా మన జగనన్న పాలన ఉంది. దిశ చట్టం, ప్రభుత్వం అందించే ప్రతీ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. శ్రావణ శుక్రవారం రోజున కాపు నేస్తం నగదు విడుదల.. వరలక్ష్మి వ్రతానికి కానుకగా అక్కచెల్లెమ్మలందరూ అందుకోబోతున్నారు. సోదరుడిగా సీఎం వైయస్‌ జగన్‌ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నారు. లెక్కలు పరిశీలిస్తే.. 2015 నుంచి 2019 వరకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా కాపుల్లో కేవలం 38 వేల మందికి మాత్రమే సాయం అందింది. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ వచ్చిన తరువాత సంవత్సరానికి 3లక్షల చొప్పున మూడు సార్లు కాపు నేస్తం అందించారు. మనసున్న మనిషి పాలన ఇలాగే ఉంటుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.