కాకినాడ‌: కాపు మ‌హిళ‌ల‌కు వైయ‌స్ఆర్ కాపు నేస్తం ప‌థ‌కం మాత్ర‌మే కాద‌ని, వివిధ సంక్షేమ ప‌థ‌కాల ద్వారా చేత‌ల్లో చూపిస్తూ కాపు కాస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కాపుల‌తో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైయ‌స్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నామని తెలిపారు.  మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా చెప్పారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా వైయ‌స్సార్‌ కాపు నేస్తం అందిస్తున్నామని, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైయ‌స్ జగన్‌ ఉద్ఘాటించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైయ‌స్సార్‌ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రసంగించారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

  • ఈ రోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్షరాల ఈ రోజు మూడో ఏడాది 338792 మంది నా అక్కచెల్లెమ్మలకు ఈ రోజు కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్‌ నొక్కి నేరుగా రూ.580 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నా. ఎలాంటి లంచాలు, వివక్షకు తావులేకుండా నేరుగా పంపించే మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నా.
  • మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వమని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు.
  • మనది రైతుల ప్రభుత్వమని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు.
  • మనది పేదల ప్రభుత్వమని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు.

By admin

Leave a Reply

Your email address will not be published.