కూకట్‌పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ హోటల్‌లో తాగిన మత్తులో ఐదుగురు మందుబాబులు రెచ్చిపోయారు. హోటల్‌లో ఫర్నీచర్‌ ధ్వంసం చేసి.. కూర్చీలతో దాడులు చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. పాపారాయుడు నగర్‌లోని కేవీ టిఫిన్‌ సెంటర్‌ ఎదుట మందుబాబులు.. సతీష్‌ అనే వ్యక్తితో గొడవకు దిగారు. ఈ క్రమంలో టిఫిన్‌ సెంటర్‌లోకి ప్రవేశించి గొడవపడ్డారు. దీంతో, వారిని బయటకు వెళ్లాలని హోటల్‌ యజమాని, సిబ్బంది కోరగా.. వారితో కూడా మందుబాబులు గొడవకు దిగి.. ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడికి చేసుకున్నారు. కాగా, మందుబాబుల వీరంగం.. హోటల్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

By admin

Leave a Reply

Your email address will not be published.