రోమ్‌: కొంతమంది తమ ఇంటి బాధ్యతల నుంచి తప్పించకుని స్వేచ్ఛగా ఉండటానికే ఇష్టపడుతుంటారు. అంతేకాదు ఏ బాధ్యతలు లేకుండా హాయిగా గడపటం కోసం ఏం చేయడానికైనా లేదా ఎలాంటి చోట ఉండటానికైనా సిద్దపడతారు. అచ్చం ఇలాగే ఇటలీకి చెందిన ఓ వ్యక్తి స్వేచ్చగా ఉండటం కోసం కుటుంబానికీ దూరంగా జైల్లో ఉండాలనుకుంటున్నాడు. అంతేకాదండోయ్‌ నన్ను జైల్లో పెట్టండి అంటూ పోలీసులను కూడా అభ్యర్థించాడు.

వివరాల్లోకెళ్లితే…..గైడోనియా మాంటెసిలియోలో నివసిస్తున్న 30 ఏళ్ల అల్బేనియన్ అనే వ్యక్తి ఇంట్లో తన భార్యతో కలిసి జీవించలేనని, చాలా నరకప్రాయంగా ఉందని కారబినీరి పోలీసుల కు తెలిపాడు. అంతేకాదు ఈ కుటుంబ జీవితంతో విసుగు చెందానని, నా భార్య నుంచి తప్పించుకోవడం కోసం నన్ను జైల్లో పెట్టండి అంటూ అభ్యర్థించాడని పోలీసలు చెబుతున్నారు.

ఈ మేరకు టివోలి కారబినీరికి చెందిన పోలీస్‌ కెప్టెన్‌ ఫ్రాన్సిస్కో గియాకోమో ఫెర్రాంటే మాట్లాడుతూ…అల్బేనియన్ చాలా నెలలుగా మాదకద్రవ్యాల నేరం కింద గృహ నిర్బంధంలో ఉన్నాడని పైగా ఆ శిక్ష ఇంకా ముగియలేదని చెప్పారు. అంతేకాదు తాను ఇక గృహ నిర్భంధంలో కొనసాగాలేనని అది చాలా నరకప్రాయం ఉందని చెప్పడన్నారు. ఈ మేరకు తాను జైలుకు వెళ్లాలనకుంటున్నానని తనను జైల్లో పెట్టండి అంటూ అభ్యర్థించాడని కూడా అన్నారు. ఈ క్రమంలో పోలీసులు గృహ నిర్భంధాన్ని ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడమే కాక అతడిని జైలుకు తరలించాలని న్యాయశాఖ అధికారులు ఆదేశించారని పోలీసులు పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.