విశాఖ‌: మాది డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్‌)..చంద్ర‌బాబుది డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అభివ‌ర్ణించారు. బాబు పాలనలో ఉన్నదంతా.. ఆ నలుగురు, ఆ దుష్టచతుష్టయం, చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ-5.. వీరి విధానం.. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే అన్నారు. శ‌నివారం మంత్రి విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏమన్నారంటే…

ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే. చంద్రబాబుకు ఉన్న ఫ్రెండ్స్ ఎవరంటే..
1. రామోజీ
2. రాధాకృష్ణ
3. బీఆర్ నాయుడు
4. ఇతర ఎల్లో మీడియా

– వీరితో పాటు దత్తపుత్రుడు.

2- మరోమాట కింద చెప్పాలంటే.. చంద్రబాబుకు ఉన్న ఫ్రెండ్స్ః
1. వెన్నుపోటు
2. వంచన
3. మోసం
4. దగా

3- బాబు ఎంత పచ్చి అబద్ధాలు చెబుతాడు అంటే.. వివరించడానికి రెండు ఉదాహరణలు చెబుతున్నాను.
1. రాష్ట్రం అప్పుకు సంబంధించి ఆయన చెబుతున్న అబద్ధాలు
2. హుద్ హుద్ కు సంబంధించి ఆయన చెబుతున్న అబద్ధాలు

4- ఇందులో మొదటిది రాష్ట్ర అప్పులకు సంబంధించి..  ఆయన చెబుతున్న అబద్ధాలను చూడండి.
– రాష్ట్రం అప్పుః రూ. 8 లక్షల కోట్లు అయిందని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు
– కనీసం తన దుష్ట పత్రిక ఈనాడులో రాసిన వార్తల్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకోలేదు.

By admin

Leave a Reply

Your email address will not be published.