తెలంగాణలో పాలిటిక్స్‌ శరవేగంగా మారుతున్నాయి. కాగా, కాంగ్రెస్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.

శనివారం సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై సీఎ‍ల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఉప ఎన్నిక కోరుకోవడం లేదు. రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోంది. ఆయనకు ఉన్న ఇబ్బంది తెలుసుకొని పరిష్కారం చేస్తామన్నారు. సాధ్యమైనంత వరకు ఆయన పార్టీలోనే ఉండేలా చూస్తాము.

వర్షాల కారణంగా హైదరాబాద్‌ ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రజలు కష్టాలు పడుతుంటే సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆదాయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు దారాపోశారు. ఇంత వరకు ఒక ఎకరాకు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.