కృష్ణా (మచిలీపట్నం): పేదల సొంతింటి కల సాకారం అయ్యే తరుణం ఆసన్నమైంది. టిడ్కో గృహాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. రిజి్రస్టేషన్‌ పూర్తయితే ఇంటిపై సర్వ హక్కులు పొందినట్లేనని అధికారులు చెప్పటంతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు సబ్‌ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు టిడ్కో గృహ లబ్ధిదారులతో ప్రస్తుతం సందడిగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రంగం దీనిపై దృష్టి పెట్టింది. కలెక్టర్‌ రంజిత్‌ బాషా.. మున్సిపల్, టిడ్కో, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో దీనిపై తరచూ సమీక్షించి దిశానిర్దేశం చేస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో టిడ్కో ఇళ్ల పేరుతో హంగామా చేసి, నాటి పాలకులు నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలేశారు. పేదలైన లబి్ధదారులకు మేలు చేకూర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి టిడ్కో గృహాలను పూర్తి చేసి ఇవ్వాలని ఆదేశించారు. మచిలీపట్నంలో 2,304, గుడివాడలో 8,912, ఉయ్యూరులో 2,496 కలిపి మొత్తం జిల్లాలో 13,712 గృహాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం ఇళ్లు పూర్తయ్యాయి. 365 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం గల గృహానికి రూ. 3.15 లక్షలు, 430 ఎస్‌ఎఫ్‌టీ గృహాలకు రూ.3.65 లక్షలు రుణం మంజూరు చేయాలని ప్రభుత్వం బ్యాంకులకు నిర్దేశించింది. ఇందుకు రిజి్రస్టేషన్లు అవసరం దృష్ట్యా, యుద్ధ ప్రాతిపదికన వీటిని పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.