కరోనా కేసులపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేసింది. కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి అంటూ సంచలన కామెంట్స్ చేసింది. వాక్సినేషన్ పూర్తయినప్పటికీ ఆరు వారాల కంటే మించి ఇమ్యూనిటీ ఉండదని దీదీ ఆరోపించింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి కారణాలను వెతికే బాధ్యతను రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి అప్పగించింది. ఇది ఇలా ఉంటే దేశంలో ఇప్పటికే వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

దాంతో ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. వంద కోట్ల డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తి చేయడం దేశానికి గర్వకారణమని అన్నారు. అయితే ఈ క్రమంలో దీదీ చేసిన కామెంట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆరు నెలలు మాత్రమే వ్యాక్సిన్ ప్రభావం చూపిస్తుందని చెప్పడంతో మళ్లీ ఆందోళన మొదలవుతుంది. మరోవైపు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం తో దీదీ చేసిన కామెంట్లు ప్రజలకు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.