తిరుపతి: చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారని మంత్రి ఆర్కే రోజా విమ‌ర్శించారు.  తిరుమల శ్రీవారిని మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో మంత్రినయ్యానని, వరదలైపోయాక కూడా చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా, అప్పులు చేశారని,  విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ నాయకులు ఎంజాయ్ చేశారని మంత్రి రోజా అన్నారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా పేదవాళ్లు సంక్షేమం కోసం సీఎం జగన్ పని చేస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు  పోలవరం కట్టకుండా జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకుని,కుప్పాన్ని మునిసిపాలిటీ చేసుకోలేని చంద్రబాబు, ముంపు గ్రామాలను జిల్లాగా చేస్తానని అనడం హాస్యాస్పదమన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.