తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. 2008 నవంబర్‌ 11న ముంబైలో పేలుళ్ల ఘటన జరిగిన నెలల్లోనే ఉగ్రవాదంపై పాకిస్థాన్‌తో భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

‘అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై కొచ్చిలో ఆదివారం గవర్నర్‌ మాట్లాడారు. నవంబర్‌ 11 ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులతో దేశం మొత్తం గాయపడిందన్నారు. ఉగ్రవాదుల కారణంగా దేశమంతా విషాదంలో మునిగిపోతే, ఘటన జరిగి 9 నెలలు గడవకముందే ఇరు దేశాలు (అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పాక్ ప్రధాని) తీవ్రవాద బాధితులుగా పేర్కొంటూ సంతకాలు చేశాయని గుర్తు చేశారు. పాకిస్థాన్‌ మనకు మిత్రదేశమా, లేక శత్రు దేశమా ఈ అంశంలో క్లారిటీ ఉండాలని, కన్ఫ్యూజన్‌ ఉంకూడదని అన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published.