ఎవరికి టికెట్టు దక్కుతుందో తెలియదు కానీ, మాకంటే మాకేనంటూ టీడీపీ నేతాగణం అప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. అడ్డొస్తే సహించేది లేదంటూ పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గంపై అడ్డంగా విరుచుకుపడుతున్నారు. రెండుగా విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందర్నీ ఒకచోటకు తెచ్చి సయోధ్య కుదర్చాల్సిన పార్టీ జిల్లా అధినేత తనకే టికెట్టు దక్కుతుందో లేదో తెలియక బయటకు రావడమే మానేశారు. ఎన్నికలకు రెండేళ్లుండగానే నేతలు కుమ్ములాటల్లో తేలియాడుతుండడంతో కిందిస్థాయి నాయకులు,  కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల తీరుతో కేడర్‌ విసిగిపోతోంది. కొంత మంది ఆ పార్టీ కీలక నాయకులు బహిరంగంగానే అసమ్మతి గళం వినిపిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.