హైదరాబాద్: పాతబస్తీ డబీర్ పురా బ్రిడ్జిపై ప్రయాణమంటేనే వాహనదారులు జంకుతున్నారు. ఎక్కడ అడుగువేస్తే గోతులు పడతాయో, ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. తరచూ డబీర్ పురా బ్రిడ్జిపై భారీగా గోతులు ఏర్పడడంతో నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డబీర్ పురా బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కాలంలో దాదాపు రెండు, మూడు సార్లు బ్రిడ్జీపై గుంటలు పడడంతో వాహనదారులు ఆ బ్రిడ్జిపై ప్రయాణించాలంటే భయపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి నాలుగు అడుగులమేర గుంట ఏర్పడింది. జీహెచ్ఎంసీ అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసి బారికేడ్లు పెట్టి అటుగా ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
