తాడేప‌ల్లి: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుక‌ల‌ను తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పింగ‌ళి వెంక‌య్య విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆవిష్కరించారు. అదేవిధంగా జాతీయ ప‌తాక రూప‌క‌ర్త‌, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తిల‌కించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ రేగుళ్ళ మల్లిఖార్జునరావు స్వయంగా చిత్రించిన పింగళి వెంకయ్య చిత్రపటాన్ని ముఖ్య‌మంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ.కృష్ణమోహన్,  ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణ్‌కుమార్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, సమాచార శాఖ కమిషనర్‌ తమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి, సీఎంవో అధికారులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.