కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది. పార్టీ సమవేశానికి ఏఐసీసీ (AICC) అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi), సీడబ్ల్యూసీ సభ్యులు, రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవితపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో క్రమశిక్షణ (Discipline) అత్యంత కీలకమని చెప్పారు. ఇక యువత విషయంలోనూ సోనియా పెదవి విప్పారు. వారికి సరైన వేదికను కల్పించాలంటూ వెల్లడించారు. ఇక ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అన్నారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు (Membership registration ) కార్యక్రమం నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త రక్తమే ప్రాణాధారమని చెప్పిన సోనియా.. దేశంలో యువత (youngers) తమ గొంతు (voice) వినిపించాలని ఎదురుచూస్తున్నారని చెప్పారు. వారికి ఒక వేదికను అందజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.