💥మితి మితిమీరిపోతున్న ప్రైవేటు ఫైనాన్స్ ఏజంట్లు ఆగడాలు…💥

💥మరోసారి పడగ విప్పిన ప్రైవేటు ఫైనాన్స్ ఏజెంట్లు,… మొన్న నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి మాజీ మంత్రి కి ఫోన్ చేసి వేధించిన ఘటన మరువకముందే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో దివ్యాంగుడు పై దాడికి దిగిన ఫైనాన్స్ ఏజెంట్లు…💥

తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది …

దివ్యాంగుడైన గోవిందు అనే వ్యక్తిని కర్రతో చావబాదిన ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు వెంకట్,దేవా…

తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన ఒక వ్యక్తి 5స్టార్ అనే ఫైనాన్స్ సంస్థ నందు 3.5 లక్షలు అప్పుతీసుకున్నాడు,ఇతను ప్రస్తుతం శ్రీకాళహస్తి లో వుంటున్నాడు,,ఇదే సమయంలో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు దేవా,వెంకట్ ఇద్దరూ అప్పుతీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేయబోగా దివ్యాంగుడైన గోవిందు మా అన్న ఇంట్లో లేడు అని చెప్తున్నా వినకుండా పెద్ద కర్ర తీసుకొని దివ్యాంగుడు అని కూడా చూడకుండా చావబాదారు,ఈ ఈ సంఘటనపై దివ్యాంగుడు గోవిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…..

By admin

Leave a Reply

Your email address will not be published.