విజ‌య‌వాడ‌: పదో తరగతి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు. విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. అడ్వాన్డ్స్‌ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.టెన్త్‌  సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.. 191800 మంది పరీక్షలు రాశారు. బాలురులో పాసైన వారి సంఖ్య 66,458 ఉత్తీర్ణతా శాతం 60.83 శాతం. ఉత్తీర్ణులైన‌ బాలికల సంఖ్య 56,678 కాగా, 68.76 శాతం. మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత రాగా.. పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్, అడ్వాన్స్ సప్లిమెంటరీతో కలుపుకుని మొత్తంగా పదవ తరగతి పరీక్షలకి 6,06,070 పరీక్షలకి హాజరు కాగా.. 5,37,491 మంది ఉత్తీర్ణతా సాధించారు. మొత్తంగా ఉత్తీర్ణతా శాతం 88.68. ఈ‌ ఒక్క సంవత్సరమే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసైన‌వారిని రెగ్యులర్ పాస్‌గా పరిగణిస్తామని, కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.