నగరంలో ఐటీ వృద్ధికి ఓపెన్‌ డేటా సెంటర్లు బూస్టప్‌ ఇస్తున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,423 డేటా సెంటర్లుండగా నగరంలో సుమారు వెయ్యి వరకు ఉన్నాయన్నారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నెట్‌వర్క్‌ అభివృద్ధితోపాటు వివిధ రకాల సేవల అనుసంధానం, డిజిటల్, సాఫ్ట్‌నెట్‌ సేవలను అందించేందుకు ఈ కేంద్రాలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఐటీ రంగానికి కేరాఫ్‌గా నిలిచిన గ్రేటర్‌ సిటీలో టీఎస్‌ఐసీ, వీహబ్, టీహబ్, టీవర్క్స్, టాస్క్‌ తదితర సంస్థల ద్వారా స్టార్టప్‌లను ఇతోధికంగా ప్రోత్సహించడంతోపాటు నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. టీ ఫైబర్‌కు కేంద్రం అనుమతి లిభించడంతో డిజిటల్‌ సేవలు మరింత విస్తృతం కానున్నాయని తెలిపారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 17,328 కి.మీ. మార్గంలో కేబుల్‌ లైన్‌ ఏర్పాటైనట్లు తెలిపారు. మరో ఐదు వేల కిలోమీటర్ల మేర కేబుల్‌ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.