తాడేప‌ల్లి: రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ స్థానాల్లోనూ వైయ‌స్ఆర్‌సీపీ  విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌ పార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. గత నెల 18న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. లక్షలాది కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీపై ఆధారపడ్డాయని, ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

2019 ఎన్నికలకంటే మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాలని, అది కష్టం కానే కాదని స్పష్టంచేశారు. ఆగస్టు 4 నుంచి నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల కార్యకర్తలతోనూ సమావేశమై దిశానిర్దేశం చేస్తానని ప్రకటించారు. నెలకు 10 నుంచి 15 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తొలి సమావేశం గురువారం సాయంత్రం కుప్పం నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో జరుగుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.