కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కక్ష పెట్టుకున్న కోడలు.. ఆమెను కిరాతకంగా హత్య చేసింది. ఆపై దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే పోస్టు మార్టం రిపోర్టు అసలు విషయాన్ని బహిర్గతం చేయడంతో కోడలు జైలు పాలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్‌ పెడన పోలీస్‌ స్టేషన్‌లో గురువారం విలేకరులకు వెల్లడించారు.

పెడన పరిధిలోని కృష్ణాపురానికి చెందిన పడమట వీరబాబుతో కొండాలమ్మకు వివాహం జరిగి దాదాపు 12 ఏళ్లు అయ్యింది. ఈ క్రమంలో అత్త, కోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో అత్త రజనీకుమారి(50)పై కక్ష పెట్టుకున్న కోడలు కొండాలమ్మ ఆమె అడ్డు తొలగించుకునేందుకు గత నెల 27వ తేదీన విచక్షణ రహితంగా కర్రతో తలపై బలంగా కొట్టింది. ఆపై పీక పిసికి చంపేందుకు ప్రయత్నించింది. అప్పటికీ చనిపోకపోవడంతో చీరను మెడకు బిగించింది. ఆమె నోరు, ముక్కు నుంచి రక్తం రావడంతో స్పృహ కోల్పోయింది. దీంతో అత్త చనిపోయిందని భావించి తన భర్తకు, బంధువులకు సమాచారం అందించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.