ముంబై: ఏడేళ్ల బాలికపై ఆత్యాచారం, హత్య చేసిన నిందితుడు తేజస్‌ దల్వీ (24)ని పుణే జిల్లా పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేశారు. సాక్షాధారాలు నష్టం చేసేందుకు ప్రయత్నించిన తేజస్‌ తల్లి సుజాత దల్వీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితున్ని ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ కోఠార్ణే గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అదనంగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది.

పుణే జిల్లా మావళ్‌ తాలూకా కోఠార్ణే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఈనెల రెండో తేదీ నుంచి అదృశ్యమైంది. అంతటా గాలించినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. చివరకు బాలిక తండ్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అంతటా గాలించగా.. చివరకు బుధవారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాల వెనకాల నగ్నస్థితిలో ఉన్న బాలిక మృతదేహం లభించింది. ఈ వార్త దావానలంలా ఊరంతా పాకింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు గుమిగూడారు. పోలీసులు వెంటనే శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్లు నివేదిక వచ్చింది.

By admin

Leave a Reply

Your email address will not be published.