ఢిల్లీ: ఈ నెల 21న అధికారంగా బీజేపీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన ఢిల్లీలో బీజేపీ చీఫ్‌ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌లను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చౌటుప్పల్‌లో బహిరంగ సభ ఉండే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేశానన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సహకరించపోయినా కష్టపడ్డానన్నారు. ‘‘టీఆర్‌ఎస్‌లోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. వారిపై అధిష్టానం ఏం చర్యలు తీసుకుంది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. కాంగ్రెస్‌, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నా.. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారడం మోసం చేయడమా? మునుగోడు అభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేశా. నా రాజీనామాతోనైనా ముఖ్యమంత్రి కళ్లు తెరవాలి. మునుగోడులో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని’’ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.