అమరావతి: రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో 282 టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో 71 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), 211 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులున్నాయి. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా  ఎంపికచేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జోన్ల వారీగా సెలెక్షన్‌ కమిటీల ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి. టీజీటీ పోస్టులు జోన్‌ 1లో 17, జోన్‌ 3లో 23, జోన్‌ 4లో 31 ఉండగా పీజీటీ పోస్టులు జోన్‌ 1లో 33, జోన్‌ 2లో 4, జోన్‌ 3లో 50, జోన్‌ 4లో 124 ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ‘హెచ్‌టీటీపీఎస్‌://సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాలి. ఇటీవలి పాస్‌పోర్టు సైజు ఫొటో, స్పెసిమన్‌ సిగ్నేచర్‌ స్కాన్డ్‌ కాపీలను స్పష్టంగా కనిపించేలా అప్‌లోడ్‌ చేయాలి. అభ్యర్థులకు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి.

By admin

Leave a Reply

Your email address will not be published.