చెన్నై: తమిళనాడులోని కల్లకురిచి జిల్లా శంకరాపురంలో మంగళవారం ఒక బాణాసంచా దుకాణంలో పేలుళ్లు సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. దీపావళిని పురస్కరించుకొని శంకరాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన దుకాణంలో ఆకస్మాత్తుగా టపాసులు పేలాయి.
దీంతో ఒక్కసారిగా దుకాణంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైన 10 మందిని కల్కర్చి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.