పత్రికా ప్రకటన(06.08.2022)

కర్నూలు జిల్లా …

కర్నూలు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారు

కర్నూలు నగరంలోని కర్నూలు ఒకటవ పోలీసు స్టేషన్ ను కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారు కలిసి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు.

నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

సిబ్బంది పని తీరును గురించి అడిగి తెలుసుకున్నారు.

పోలీసులకు తగిన సూచనలు, సలహాలు చేశారు.

స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

ప్రతి శుక్రవారం పరేడ్ నిర్వహించాలన్నారు.

ప్రతివారం మహిళా పోలీసులతో కలిసి పాఠశాలల్లో, పబ్లిక్ ప్రదేశాలలో డ్రగ్స్, చైల్డ్ మ్యారేజెస్, దిశయాప్, మహిళలపై జరిగే నేరాలు , ఆన్ లైన్, సైబర్ మోసాలు తదితర విషయాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.

పోలీసు అధికారులు ,మహిళ పోలీసులు బాగా పనిచేసి లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో కేసులు రాజీ, పరిష్కారం అయ్యే విధంగా చూడాలని సూచించారు.

ట్రాఫిక్ , స్టాప్ అండ్ వాష్, ఈ చలాన్ ల పెండెన్సీ ని తగ్గించే విధంగా చూడాలన్నారు.

కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్, కర్నూలు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ సిఐ తిమ్మారెడ్డి, ఎస్సైలు ఉన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు.

By admin

Leave a Reply

Your email address will not be published.