విండీస్‌ టూర్‌ ముగిసిందో లేదో అప్పుడే భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందడి మొదలైంది. ఆసియా కప్‌ 2022లో భాగంగా చిరకాల ప్రత్యర్ధులైన ఈ రెండు దేశాలు ఆగస్ట్‌ 28న తలపడనున్నాయి. దాయాదుల మధ్య హైఓల్టేజీ సమరానికి 20 రోజుల ముందుగానే వాతావరణాన్ని వేడెక్కించేందుకు టోర్నీ ప్రసారదారు స్టార్‌ స్పోర్ట్స్‌ ఓ ఆసక్తికర ప్రోమోను విడుదల చేసింది.

ఇందులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాక్‌తో సమరానికి సై అన్నట్లుగా క్రీజ్‌లో కాలుదువ్వుతూ కనిపిస్తాడు. క్రికెట్‌ పరంగా భారత్‌-పాక్‌ల మధ్య ప్రత్యేక అనుబంధముందని, పాక్‌ జట్టులోనూ మంచి ఆటగాళ్లు ఉన్నారని రోహిత్‌ ఈ ప్రోమోలో ప్రస్తావిస్తాడు. భారత్‌ ఎనిమిదో సారి ఆసియా కప్‌ గెలవాలి, విశ్వవేదికపై భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడాలంటూ అభిమానుల్లో ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.