అమరావతి: ఏపీ, ఒరిస్సా సరిహద్దులో గిరిజన గ్రామాలలో గతంలో తాను చేసిన యాత్రను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. తన పోరాట యాత్ర 2018లో రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగ పడిందన్నారు. ”ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు’లోని గిరిజన ప్రాంతాలలో ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, ‘గంజాయి వ్యాపారం అక్కడ మాఫియా’ గురించి నాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి” అని పవన్ ట్వీట్ చేశారు. అలాగే అక్కడ తన పర్యటనకు సంబంధించిన వీడియోను పవన్ పోస్ట్ చేశారు.