కరీంనగర్: ఒకప్పుడు పాడుబడిన జీపు అటూ ఇటూ ఊగుతూ పల్లెల్లోకి వచ్చేది. అభిమానులు దయతలచి రిపేరు చేయిస్తేనే రయ్‌మంటూ తిరిగేది. టాప్‌పైన తనకు ఓటేయాలంటూ నాయకుడు కనిపించేవాడు. ఎన్నికల్లో ప్రచారం కోసం ఖర్చంటే కేవలం భోజనాల కోసమే వెచ్చించేవారు. తలా కొంత పోగేసుకుని భాగస్వాములయ్యేవారు. ఇక ఎన్నికల డిపాజిట్ రూ.250 నుంచి రూ.500 ఉండేది. మొత్తం వ్యయం రూ.3,000 నుంచి రూ.10,000 వరకు అయ్యేది. ఇది నాలుగు దశాబ్దాల కిందటి మాట.