తాడేప‌ల్లి: అశ్లీల సామ్రాజ్యానికి బాబే చక్రవర్తి అని మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమ‌ర్శించారు.              తెలుగుదేశం పార్టీ ఒక శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోంది. ఇది ఈరోజు వారు పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ అంటూ.. చేసిన ఒక వికృత మీటింగ్‌లో మరింతగా బయటపడింది.

– మహిళలకు సంబంధించి ఏపీలో ఎటువంటి సమస్యా లేదు. ఉన్న సమస్యంతా చంద్రబాబు, లోకేశ్‌తోనే. వారు పెట్టుకున్న మీడియా, సోషల్ మీడియాతోనే. ఎక్కడో ఓ వీడియో వారే సృష్టించి ఆ వెంటనే న్యూడిటీ అంటూ వారే గగ్గోలు పెట్టి ఆ తర్వాత వారే డిబేట్స్ కండెక్ట్ చేసి, వారే ప్రెస్‌మీట్లు పెట్టించి ఆ తర్వాత వారే ఏకంగా రౌండ్ టేబుల్ పెట్టారు. సిగ్గులేకపోతే సరి.. ఇటువంటివి చేయటానికి.

టీడీపీ చర్యల వల్లే మహిళలు బాధితులుగా మారుతున్నారు
అసలు ఒక అత్యాచారం కానీ, అరాచకం కానీ, మహిళలను కించపరిచే విధంగా ఒకరి ప్రవర్తన కానీ ఉంటే బాధితురాలు బయటకు వచ్చి చెప్పుకోవాలి. కానీ, టీడీపీ చేస్తున్న పనుల వల్ల మహిళలు బాధితులుగా మారుతున్నారు తప్ప, బాధిత మహిళలకు ఏరోజూ టీడీపీ అండగా నిలబడటం లేదు.

By admin

Leave a Reply

Your email address will not be published.