చిత్తూరు: కుప్పం మునిసిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.66 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. 25 వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం రూ.67 కోట్లకు గతంలో ప్రతిపాదనలు పంపారు. గత వారం కుప్పం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల సమావేశంలో కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు సీఎం వైయ‌స్‌ జగన్‌ తెలిపారు.

కుప్పం కూడా తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానమని ప్రకటించారు. ఈ క్రమంలో నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం విశేషం. ప్రధానంగా మురుగునీటి కాలువలు, తాగునీటి కోసం నూతనంగా బోర్లు, పైప్‌ లైన్లు, సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, అంగన్‌వాడీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, దళవాయి, కొత్తపల్లె చెరువు కట్ట వద్ద పార్కు అభివృద్ధి, చెరువు నుంచి పట్టణానికి నీటి సరఫరా కోసం పైప్‌లైన్ల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.