స్థానిక కస్పా హైసూ్కల్‌ సమీపంలో ఒక గ్రూప్‌ హౌస్‌లో మేడమీద వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను టూటౌన్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. కస్పా హైస్కూల్‌ సమీపంలో ఉన్న గ్రూప్‌హౌస్‌ మేడమీద ఉంటున్న ఇద్దరు మహిళలు ఇద్దరేసి యువతులు చొప్పున తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.

ఈ మేరకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి నిర్వాహకులైన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.