ఘట్‌కేసర్‌: హామీల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. స్థానిక సంస్థల అభివృద్ధికి మూడేళ్లుగా మంత్రిని నిధులు అడిగితే ఎంపీపీనని చూడకుండా మంత్రి మల్లారెడ్డి వ్యక్తిగతంగా తనను దూషిస్తున్నారని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆరు నెలల కిందట ఇచ్చిన ప్రొసిడింగ్స్‌ పనులకు దిక్కులేదని.. నిధులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిధుల కోసం అధికారులకు వినతులు ఇ‍చ్చి , గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టినా నిధులు ఇవ్వడం లేదన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.