ఒక్కపూట తిండి కోసం అలమటించే ఎందరో నిరుపేదలు, నిరాశ్రయుల ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని, ఇందులో భాగంగా రూ.6కే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఎమ్మెల్యే వైవీఆర్‌ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్‌–వైవీఆర్‌ క్యాంటీన్‌’ను బుధవారం ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్‌ మాట్లాడుతూ.. దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఉడతాభక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని తానుంత వరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని రూ.6కే అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్‌ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుర ప్రముఖులు అభినందించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.