బాపట్ల సభలో సీఎం జగన్‌ ప్రసంగం అనంతరం 2022 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు.

11 Aug 2022, 12:09

Picture
తేడాను గమనించండి

పథకాలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు?. గత పాలనలో రాష్ట్రంలో నలుగురే బాగుపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వారికి కడుపుమంట. వారిలా నాకు ఏబీఎన్‌, ఈనాడు, టీవీ5 అండగా లేవు. మీ అందరి దీవెనలే నాకు అండగా ఉన్నాయి.  మన ప్రభుత్వం వచ్చాక డీబీటీ ద్వారా పేదలకు నేరుగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం.  గత పాలనకు ఈ పాలనలో తేడాను గమనించండి అని సీఎం జగన్‌ ప్రజల్ని కోరారు.

11 Aug 2022, 12:04

Picture
విద్యారంగంపై మూడేళ్లలో రూ.53వేల కోట్లు

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకు రూ.11,715 కోట్లు నేరుగా అందించాం. చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాటు కాకూడదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. అమ్మఒడి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం, బైజ్యూస్‌తో ఒప్పందం ఇలా విద్యారంగంపై మూడేళ్లలో రూ.53వేల కోట్లు ఖర్చుపెట్టాం. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.

By admin

Leave a Reply

Your email address will not be published.