హైదరాబాద్‌: దేశ స్వాతంత్య్రానికి 75 సంవత్సరాల సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్‌లోని 75 ఖాళీ ప్రదేశాల్లో ఫ్రీడమ్‌ పార్కుల ఏర్పాటును బుధవారం చేపట్టింది. వజ్రోత్సవం గుర్తుగా 75ను ప్రామాణికంగా తీసుకొని పనులు చేయనున్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా 75 ఫ్రీడమ్‌ పార్కులకుగాను ఎల్‌బీనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌జోన్లలో 12 చొప్పున, ఖైరతాబాద్‌ జోన్‌లో 15 పార్కులు వెరసి మొత్తం 75 ఫ్రీడమ్‌పార్కులకు శ్రీకారం చుట్టారు.

వాటిల్లో ప్లాంటేషన్‌ ప్రారంభించారు. ఈ పార్కుల్లోని వాకింగ్‌ ట్రాక్స్, బెంచీలు సైతం జెండా రంగులను కలిగి దేశ ఫ్రీడమ్‌ను గుర్తుచేస్తాయి. ఎటొచ్చీ ఫ్రీడమ్‌ థీమ్‌తోనే ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తారు. పార్కులకున్న స్థలాల్ని బట్టి 75 లేదా 750 లేదా 7500 మొక్కలు నాటుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.