తాడేపల్లి: పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యం దిశ‌గా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేర‌కు విద్యారంగంలో అనేక విప్ల‌వాత్మ‌క‌ సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. విద్య కోసం అనేక ప‌థ‌కాల‌నూ అమ‌లు చేస్తున్నారు. జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అండగా నిలుస్తోంది. కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మ‌రికాసేప‌ట్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. బాపట్లలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.