నంద్యాల జిల్లా
11-08-2022

మహిళా అత్యాచారం కేసులో ముద్దాయి కి జైలు శిక్ష

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కోవెలకుంట్ల సర్కిల్ పరిధిలోని రేవనూరు పోలీస్ స్టేషన్ నందు 2019 సంవత్సరంలో క్రైమ్ నెంబర్.25/2019, U/s 376 IPC & Sec 6 of POCSO Act కేసు నమోదు చేయగా గౌరవ 1 ADJ కోర్టు కర్నూలు వారు విచారణ జరిపి ముద్దాయికి 20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 5,000/- జరిమానా విధించడమైనది.

వివరాలు……

ఫిర్యాది : బోయ శ్రీనివాసులు, వయస్సు 33 సం., యం.ఉప్పలూరు గ్రామము, కోయిలకుంట్ల మండలం

ముద్దాయి :- బి.జె. పుల్లయ్య, వయస్సు 60 సం., సంగపట్నం గ్రామము, అవుకు మండలం.

నేరము జరిగిన తేదీ : 13.3.2019 తేదీ కి ముందు జరిగింది.

కేసు నమోదు చేసిన తేదీ :- 14.3.2019.

ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసినది :- జె. రమేశ్ కుమార్ , ఎస్‌ఐ రేవనూరు పోలీసు స్టేషన్.

కేసు దర్యాప్తు అధికారి : జె. తిప్పేస్వామి, ఎస్‌డి‌పి‌ఓ, ఆళ్లగడ్డ.

నేరమునకు శిక్ష :- ఈ కేసులో ముద్దాయి అయిన బి.జె. పుల్లయ్యకు 20 సం,, జైలు శిక్ష మరియు Rs.5,000/- జరిమానాను విధిస్తూ 1st ADJ, కోర్ట్ కర్నూలు మెజిస్ట్రేట్ వారు ఉత్తర్వులు జారీ చేయడమైనది.

ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం ఉంది కావున ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని మహిళలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం. నంద్యాల.

By admin

Leave a Reply

Your email address will not be published.