ముంబై: ఉపాధి కల్పిస్తామని ఆశజూపి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టి వారితో డబ్బులు సంపాదిస్తున్న ముఠా గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. గురు వారం ముంబై మీడియాకు పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటికి పనిమనుషులు కావాలన్న ప్రకటనలతో వివిధ రాష్ట్రాలనుంచి మహిళలను రప్పించి వారిని ముంబైలోని ఓ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు.

అవసరమైన విటులకు ఈ మహిళలను హోటళ్లకు, ప్రైవేట్‌రూమ్‌లకు పంపించి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4న రాజు, సాహిల్‌ అనే ఇద్దరు వ్యక్తులు తనతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారంటూ ఓ మహిళ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ)ను ఆశ్ర యించడంతో దాన్ని ఫిర్యాదుగా స్వీకరించిన ఈ బృందం రంగంలోకి దిగింది.

మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నెరుల్‌ ప్రాంతంలోని శిరవాణే గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 మంది మహిళలను ఏహెచ్‌టీయూ బృందం కాపాడింది. వీరికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.