అమరావతి: రైతుల పరపతిని పెంచడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే)ను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)తో అనుసంధానిస్తోంది. ఇప్పటికే ఆర్బీకే స్థాయిలో పీఏసీఎస్‌ల ద్వారా రైతుక్షేత్రాల వద్దే పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ విషయంలో సర్కారు మరో అడుగు ముందుకేసి ఆర్బీకేలను–పీఏసీఎస్‌లతో అనుసంధానించడం ద్వారా కౌలు, సన్న, చిన్నకారు రైతులకు పరపతి సౌకర్యాన్ని కల్పించాలని సంకల్పించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.