నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. తన సెక్యూరిటీ, తనయుడిపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని వేసిన రఘురామ పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. శుక్రవారం డిస్మిస్‌ చేసింది.

కాగా, ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌పై దాడి కేసులో రఘురామ.. సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక, విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు లాయర్‌ అదనపు సమాచారం కోసం సమయం కోరారు. ఈ క్రమంలో ధర్మాసనం.. కేసు ఎఫ్‌ఐఆర్‌ దశలోనే ఉంది కదా.. విచారణ కానివ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఇదిలా ఉండగా… రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో కూడా చుక్కెదురైన విషయం తెలిసిందే. గచ్చిబౌలి పీఎస్‌లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.

By admin

Leave a Reply

Your email address will not be published.