టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు భారత్‌ మరో మెగా టోర్నీకు సిద్దమవుతోంది. ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియాకప్‌లో టీమిండియా పాల్గొనుంది. ఇప్పటికే ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గత కొంత కాలంగా జట్టుకు దూరమైన భారత స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో భారత ఓపెనింగ్‌ సమస్య తీరినట్టే అని చెప్పుకోవాలి.

కాగా గాయం కారణంగా రాహుల్‌ జట్టుకు దూరం కావడంతో గత కొన్ని సిరీస్‌ల నుంచి భారత్‌ పలు ఓపెనింగ్‌ జోడీలను ప్రయోగించింది. అందులో భాగంగానే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్‌ జోడిగా సూర్యకుమార్‌ యాదవ్‌ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు.

అయితే ఓపెనర్‌గా సరికొత్త అవతారమెత్తిన సూర్య పర్వాలేదనపించాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన సూర్య 135 పరుగులు సాధించాడు. ఇది ఇలా ఉండగా.. రాహుల్‌ జట్టులోకి వచ్చినప్పటికీ రోహిత్‌ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని  పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.

ఈ నేపథ్యంలో తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. “ఆసియాకప్‌లో రోహిత్‌ శర్మ జోడిగా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాలని నేను భావిస్తున్నాను. అతడు విండీస్‌ సిరీస్‌లో రోహిత్‌ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వచ్చినప్పటికీ.. అతడు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తే బాగుటుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.