కాకినాడ జిల్లా, కాకినాడ.
ది.12.08.2022.

☑️అర్ధరాత్రి “ఉమెన్ డ్రాప్ ఎట్ హోం” వాహనాన్ని ఆశ్రయించి డ్రాప్ ఎట్ హోం వాహన సేవలను వినియోగించుకున్న వివాహిత మహిళ.

☑️SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS., గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మహిళ.

☑️మహిళ మరియు ఆమె చిన్నారిని సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చిన కాకినాడ పోలీసులు.

ది. 12-08-2022 అర్ధరాత్రి 00.32 గం. లకు కాకినాడ ,జగన్నాధపురం వద్ద ఒక వివాహితతో ఆమె భర్త గొడవపడి వదిలి వెళ్ళిపోయినందున, సదరు వివాహిత చీడిగ లోని తన ఇంటికి వెళ్లేందుకు ఏ విధమైన ప్రయాణ సౌకర్యం లేనందున ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయగా ఉమెన్ డ్రాప్ ఎట్ హోం వాహనం కాకినాడ, జగన్నాధపురం చేరుకొని మహిళా పోలీస్ సిబ్బంది WPC 4565 సంరక్షణలో ఇంద్రపాలెం ఎస్ఐ గారు సిబ్బంది సదరు మహిళను మరియు ఆమె చిన్నారిని చీడిగ లోని వారి ఇంటి వద్ద 01.00 కు సురక్షితం చేర్చడం జరిగింది.

సురక్షితంగా తన గమ్య స్థానానికి చేరుకోవడానికి ఉపయోగపడిన ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ వాహనంలో డ్యుటీ లో వున్న మహిళా సిబ్బంది, ఇంద్రపాలెం SI మరియు ఈ విశిష్ట కార్యక్రమాన్ని రూపొందిచిన జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS గారికి సదరు మహిళ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

By admin

Leave a Reply

Your email address will not be published.