హైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కలో బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు ముందుకు సాగనున్నాయి. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించాలని నిర్ణయించాయి. ఇప్పటికే వేర్వేరుగా పార్టీ కార్యకర్తలతో స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే గతంలో అనేకసార్లు సీపీఐ అభ్యర్థులు మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ ఆ పార్టీకి క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. సీపీఎం కూడా కొంతమేరకు ఓటు బ్యాంకు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని పోటీకి దింపే విషయం కూడా సీపీఐ సమాలోచనలు చేస్తోంది. పోటీ చేస్తే గెలవగలమా? ఒకవేళ గెలవ లేని పరిస్థితి ఉంటే ఓట్ల చీలిక వల్ల బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? అనే కోణంలో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ క్యాడర్‌తో జరుగుతున్న సమావేశాల్లో మాత్రం చాలామంది పోటీ చేయాలనే సూచిస్తున్నట్లు తెలిసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.