ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ

పత్రికా ప్రకటన. తేదీ. 13.08-2022.

ప్రపంచ అవయవ దానం రోజు పురస్కరించుకుని అవయవదానం చేయండి… మరోసారి జీవించండిఅని పిలిపునుచ్చిన పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.గారు

ప్రపంచ అవయవ దానం రోజు ను పురస్కరించుకుని విజయవాడ రోటరీ మిడ్ టౌన్ మరియు స్వరా హాస్పిటల్ సంయుక్తము గా నిర్వహించినటువంటి 2 కె రన్ ను ముఖ్య అతిధిగా పాల్గున్న ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా, ఐ.పి.ఏస్. గారు సత్యనారాయణ పురం శారదా కళాశాల వద్ద జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ….

ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం. ఆధునిక వైద్యశాస్త్రంలోని పురోగతి వల్ల ఇప్పుడు అవయవాలను మార్చి ప్రాణాలను నిలబెట్టగల సామర్థ్యం మన వైద్యులకు ఉంది. ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటి లభ్యత తక్కువగానూ ఉన్నది. అవయవదానంపై మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. కానీ మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవే అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయి. అలా కాదని ఖననం చేస్తే విలువైన అవయవాలు వృథాగా మట్టిలో కలిసిపోతాయి. దహనం చేస్తే కాలిపోతాయి. మట్టిలో కలవడం కంటే… కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలిగినప్పుడు మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. తమ వంతు బాధ్యత గా ప్రతి ఒక్కరు అవయవ దానం చేయడానికి ముందుకురావాలని, అవయవదానం చేయండి… మరోసారి జీవించండి అని అన్నారు.

ఈ కార్యకమం లో ఎం కృష్ణ ప్రభువు రోటరీ మిడ్ టౌన్ ప్రెసిడెంట్,గారు సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు గారు మరియు వైద్యులు,వైద్య సిబ్బంది,మరియు తదితరులు పాల్గున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.