న్యూఢిల్లీ : (Ramdev Baba) యోగా గురు రామ్‌దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో అల్లోపతికి వ్యతిరేకంగా రామ్‌దేవ్ బాబా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని ఆరోపణలు ఉన్నాయి. రామ్‌దేవ్‌పై పలు వైద్యుల సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సీ హరిశంకర్, రామ్‌దేవ్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చారు. పిటిషన్‌లోని ఆరోపణల మెరిట్‌లపై తానెలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రిషికేశ్, పాట్న, భువనేశ్వర్‌లోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, లాలా లజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజ్ మీరట్ తదితర సంఘాలతోపాటు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రామ్‌దేవ్ బాబాపై పిటిషన్ దాఖలు చేశాయి.