ఎన్టీఆర్ జిల్లా,జగ్గయ్యపేట

వత్సవాయి మండల కేంద్రంలో జగ్గయ్యపేట నుండి వైరా వెళ్లే ప్రధాన రహదారిపై శ్రీను నాయక్ తండాకు చెందిన భూక్య రామకృష్ణ శనివారం ఉదయం
ఐదు గంటల సమయంలో వ్యవసాయ నిమిత్తం తనకున్న సాగు ఆవులతో తన పంట పొలానికి వెళ్తుండగా సిమెంట్ ట్యాంకర్ ఢీకొనడంతో రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ రెండు ఆవులు నిండు సూడివిగా చెప్పుచు
సదరు ఆవుల యజమాని భూక్య రామకృష్ణ కన్నీటి పర్వతమయ్యారు. తన జీవనాధారం తన ఆవులేనని, వాటి మృతికి కారణమైన లారీ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడుపడంతో ఆవులకు ప్రాణ నష్టం జరిగిందని,
దాదాపు 150 అడుగుల మేర సదరు (లారీ వాహనం) ఆవులను ఈడ్చుకుంటూ వచ్చిందని తెలిపి
ప్రాణ పదంగా చూసుకుంటున్న ఆవులు కళ్ళ ముందే మృతి చెందడం గుండె పగిలే అంత ఆవేదన చెందారు. ఆవులను 1,50,000కు ఈ మధ్యనే కొనుగోలు చేశానని, కుటుంబ సభ్యులు అందరం ఎంతో మమకారంగా చూసుకుంటామని బాధతో వాపోయారు. ఈ సందర్బంగా వత్సవాయి గ్రామ
సర్పంచ్ భూక్య సీతమ్మ,వెటర్నరీ, సంబంధిత పోలీసు అధికారులు ఘటనను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన సంఘటన చూపరులను సైతం కంటతడి పెట్టించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.