పర్యాటకులకు మంత్రి అవంత శ్రీనివాస్‌ శుభవార్త చెప్పరు. గత కొన్ని నెలల నుంచి నిలిచిపోయిన పాపికొండల బోటింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. బుధవారం బోటు ఆపరేటర్లతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టూరిజం, నీటి పారుదల శాఖ అధికారులు, బోటు ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. నవంబర్ 7 నుంచి పాపికొండల్లో బోటింగుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులకు బోట్లలో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలి.. భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

బోటు ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా పశ్చిమగోదావరి వైపు నుంచి బోటింగుకు అవకాశాలపై పరిశీలిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో టూరిజం పరంగా పోలవరం అతిపెద్ద టూరిజం పాయింట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా బోటింగుకు సహకరించాలని, పర్యాటకుల భద్రతే ప్రాధాన్యతగా పర్యాటక బోటులో నిర్వాహణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.