విజయవాడ: ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత అవసరమ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నామ‌ని, ప్ర‌పంచంతో పోటీ ప‌డి ప్ర‌గ‌తి  సాధిస్తున్నామ‌ని చెప్పారు.  ఏపీలో స్వాతంత్ర దినోత్సవ సంబురాలు దేశం మొత్తం అట్టహాసంగా సాగుతున్నాయి. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. సోమవారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం వైయ‌స్‌ జగన్‌. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శకటాల ప్రదర్శనను వీక్షించి.. ప్రసంగించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.